

జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం-విశాఖ రోడ్డులో మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. మద్యంమత్తులో ఓ టిప్పర్ డ్రైవర్ హల్‌చల్ చేశాడు. లెండి కాలేజీ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. విశాఖ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై స్పందించి ప్రమాదం జరగకుండా బస్సును నియంత్రించాడు. లారీకి దగ్గరగా వెళ్లి బస్సు ఆగిపోయింది. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. టిప్పర్ డ్రైవర్‌ని పోలీసులకు అప్పగించారు.