

జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
శాంతినగర్‌లో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సమాజంలో జరుగుతున్న ఆర్థిక మోసాలు, బెట్టింగ్ యాప్‌లు, ఫోక్సో కేసులు, ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ… సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారన్నారు. వాట్సాప్, ఫిస్‌బుక్, ఇతర యాప్‌లు, లింకులు హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.