

బిచ్కుంద మార్చ్ 26 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శివ సాయి కాలనీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .15 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప సెట్ కారు కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్ , ఉత్తం, విశ్వనాథ్ రెడ్డి గంగారాం సార్ , బండు పటేల్ , సంజు రిపోర్టర్ , లక్ష్మణ్ పటేల్ , జ్వాలాముఖి డాక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

