

జనం న్యూస్, 26 మార్చి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.
( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతల గట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని కోలూరు గ్రామానికి, గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని ప్రకటించి, ఇంటింటికి నల్లాలని బిగించారు. కానీ మిషన్ భగీరథ నీటిని ఈ గ్రామానికి ఇప్పటివరకు సరఫరా చేయలేదు. అప్పటి ప్రభుత్వ హయాంలో త్రవ్వించిన వాటర్ షెడ్ బావిలోని నీటిని, ఓవర్ హెడ్ నీటి ట్యాంకులో, బావినీటిని నింపి, రెండు లేక మూడు రోజులకు ఒకసారి, వాటర్ షెడ్ బావిలోని నీటిని, నల్లాల ద్వారా ఇంటింటికీ గ్రానములో నీటిని సరఫరా చేస్తున్నారు. కాని వాటర్ షెడ్ బావిలోని కరెంట్ మోటార్ చెడిపోవడంతో గత కొన్ని రోజులుగా, ఇంటింటికి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేసే, నీటి సరఫరా నిలిచిపోయింది. దీనితో గ్రామ ప్రజలకు తీవ్ర నీటి కొరత ఏర్పడి, ఇబ్బంది పడుతున్నారు. ఇట్టి విషయమై కొందరు గ్రామ ప్రజలు, పత్రికా విలేకరి నైనా, నా దృష్టికి తేగా, నేను పంచాయతీ సెక్రెటరీ కి ఎన్నోసార్లు ఫోన్ చేసినప్పటికీని, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ స్పందించలేదు. సెక్రెటరీ స్పందించకపోవడంతో, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారితోను, మండల పంచాయతీ అధికారి తోనూ, గ్రామంలో నీటి కొరతను తీర్చమని, పత్రికా విలేకరినైన నేను కోరడం జరిగింది. కాని మరుసటి రోజు గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ నన్ను ఆఫీసులోకి పిలిచి, నీటి సరఫరా జరగడం లేదని, చెత్త సేకరణ ట్రాక్టర్ గ్రామంలో తిరగడం లేదని, పంచాయతీ సెక్రెటరీ నైన నాపైన, పై అధికారులకు ఫిర్యాదు చేస్తావా, మండల అభివృద్ధి అధికారికి చెప్పుకుంటావా చెప్పుకో, కలెక్టరుకు చెపుతావా చెప్పుకో, ఏ అధికారికైనా చెప్పుకో, ఆఫీసులో నుండి వెళ్ళిపొమ్మని, నన్ను బెదిరించాడు. నేను ఎస్సీ మాదిగ కులమునకు చెందిన వాడను. పత్రికా విలేఖరిగా పనిచేస్తూ, గ్రామంలోని ప్రభుత్వ ఆస్తులను కొన్నింటిని, ఈ సెక్రెటరీ కాపాడలేకపోతున్నాడని, గ్రామంలోని కొన్ని, సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తేవడంతో పంచాయతీ అధికారి నాపై కక్షతో అవమానించాడు. పంచాయతీ అధికారిపై చర్య తీసుకోవాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పై అధికారులు స్పందించి ఈ గ్రామంలో నీటి కొరతను తీర్చాలని కోరుచున్నారు.