Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 26// కుమార్ యాదవ్ (జమ్మికుంట)..


కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి (కల్లుపల్లి) గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి, కుమార్తె హర్షిత రెడ్డి (38 ) అమెరికాలో గత 20 సంవత్సరాలు గా నివాసం ఉంటున్నారు. అకస్మాత్తుగా హర్షిత రెడ్డి రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పరిపాటి రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులు హుటా హుటిన అమెరికాకు తరలివెళ్లారు. రాజకీయంగా ఎంతో ఎత్తుకి ఎదిగినా పరిపాటి రవీందర్ రెడ్డి కి హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రజలందరూ మంచి సంబంధాలు ఉండటంతో, ఆయన కుమార్తె మృతి చెం చెందిన విషయం తెలిసాక నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా హర్షిత రెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉండడం వల్ల ఆమె అంతక్రియలు సైతం అక్కడనే నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.