

50వరోజు అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించిన జేఏసీ నాయకులు
జనం న్యూస్ మార్చి 26 సంగారెడ్డి జిల్లా పటన్ చేరు నియోజక వర్గం పారానగర్ నల్లవల్లి
డంప్ యార్డ్ వ్యతిరేకంగా గుమ్మడిదలలో 50వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేశారు. నిరాహార దీక్షలో మున్నూరు కాపు సంఘం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డంపు యార్డ్ కలుషితంతో ఈ ప్రాంతం నాశనం అవుతుందని ప్రజలు మొరపెట్టుకున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, రాష్ట్ర రైతు సంఘం మాజీ అధ్యక్షులు మంద బలరాం రెడ్డి,రైతు సంఘం అధ్యక్షులు అమ్మగారి సదానంద రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ, రైతు సంఘం మాజీఅధ్యక్షుడు పోచుగారి మోహన్ రెడ్డి,మద్ది బాల్ రెడ్డి,రవీందర్ రెడ్డి, భాస్కరరెడ్డి, ఆకుల భిక్షపతి, సంఘం ప్రతినిధులు, జేఏసీ నాయకులు, మహిళ జేఏసీ సభ్యులు పాల్గోన్నారు.