Listen to this article

జనం న్యూస్ మార్చ్ 26 కాట్రేనికోన

జిల్లా కలెక్టరు, డా.బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం వారి ఆదేశములను అనుసరించి అమలాపురం డివిజన్, కాట్రేనికోన మండలంలోని బుధవారం క్రింది తెలిపిన గ్రామాలలో సంభందిత గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఆక్వా జోన్ గ్రామ సభలు నిర్వహించడం జరిగినవి. బ్రహ్మసమేద్యం (9:30 to 11:00) పల్లంకుర్రు (11:30 to 1:00) కందికుప్ప (2:00 to 3:30) ఈ గ్రామ సభలలకు అందరు మండల స్థాయి అధికారులు తహాశీల్దారు, మత్స్యశాఖ అధికారి, వ్యవసాయ శాఖ అధికారి, ఇరిగేషన్ అధికారి మరియు గ్రామ స్థాయి అధికారులు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ మత్స్యశాఖ సహాయకులు, గ్రామ సర్వే సహాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు సంబంధిత గ్రామ ఎంపీటీసీలు లు, గ్రామ కార్యదర్శులు , వార్డ్ మెంబర్లు, ఆక్వా రైతులు మరియు ఇతర గ్రామా ప్రజలు పాల్గొనుట జరిగినది. ఈ గ్రామ సభలలో శ్రీయుత జిల్లా కలెక్టరు, డా.బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం వారి ఆదేశముల మేరకు మరియ జీవో ఎంఎస్ నెంబర్ 16 తేదీ:20.04.2018 లోని నిభందనల ప్రకారం అమలాపురం డివిజన్, కాట్రేనికోన మండలంలోని హ్మసమేద్యం, పల్లంకర్రు మరియు కందికుప్ప గ్రామంలో గ్రామ స్దాయి( వి ఎల్ టి)ల ద్వారా ఆక్వా జోనేషన్ రీ సర్వే చేయగా, గతంలో అనగా 2018 మరియు 2023 లో ఆక్వా జోన్ గెజిట్ లో నమోదు కానీ చెరువుల యొక్క సర్వే నెంబర్లను మరియు వ్యవసాయానికి అనుకులంగా లేని & క్వాచెరువులు తరవ్వుటకు అనుకులంగా వున్న భూముల వివరములను నమూనా లయందు పొందు పరచి, 7 రోజుల క్రితం గ్రామపంచాయితీ కార్యాలయం యొక్క నోటీసు బోర్డు నందు ప్రసూరించడమైనది. సదరు వివరములకు ఆక్వా జోన్ పరిదిలోనికి తీసుకొని వచ్చుటకు ఈ గ్రామ సభలయందు చర్చించి లోని వివరములకు ఆమోదించడమైయినది. మత్స్యశాఖ అభివృద్ది అధికారి, కాట్రేనికోన.