Listen to this article

జనంన్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 26.

తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు లో గల రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయఅధికారి ఏఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యఅతిధులు జనసేన పార్టీ మార్కాపురం ఇంచార్జీ ఇమ్మడి కాశీనాధ్, టీడీపీ యువ నాయకులు కందుల రోహిత్ రెడ్డి ని తర్లుపాడు గ్రామ నాయకులు కాళంగి శ్రీనివాసులు సాలువాతో సత్కరించారు అనంతరం కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లో కి వచ్చిన వెంటనే రైతుల కు గిట్టు బాటు ధర కల్పించేల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యుటీ సియం కొణిదెల పవన్ కళ్యాణ్ రైతుల కు మేలు జరిగేల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయటం చాలా గొప్ప కార్యక్రమం అని తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పశ్చిమ ప్రకాశం చాలా వెనుక బడిన ప్రాంతం సరైన వర్షపాతం ఉండదని అది ద్రుష్టి లో ఉంచుకొని కందుల లో తేమ శాతం, రంగు అవి పెద్దగా ఉండవని రైతులకు మేలు చేసేల కందులు కొనుగోలు చేయండి అని అధికారులకు తెలిపారు ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులుమాజీ జడ్పిటిసి రావి బాషా పతి రెడ్డి,ఈర్ల వెంకటయ్య, ఎస్ యం సి చైర్మన్ వెన్నా రాజా రామ్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మేకల వెంకట్ యాదవ్,జనసేన మండల నాయకులు వెలుగు కాశీరావు,గ్రామ కమిటీ అధ్యక్షులు గౌతుకట్ల సుబ్బయ్య, మాజీ సొసైటీ అధ్యక్షులు తిప్పిరెడ్డి వెలుగొండారెడ్డి టిడిపి నాయకులు కుందురు చిన్న కాసిరెడ్డి,షేక్ కాశీంవలి, ఈర్ల పెద్ద కాశయ్య, గోసు వెంకటేశ్వర్లు,దొడ్డా సుబ్బారెడ్డి,జనసేన మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సువర్ణ,జనసేన నాయకులు రత్నకుమార్, మహేష్, సునీల్, మోషే శివకాసి తదితరులు రైతులు పాల్గొన్నారు