Listen to this article

జనం న్యూస్- మార్చి 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్

మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానికి జైలు శిక్ష విధించబడుతుందని నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ తెలిపారు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు, వాహనాలకు సంబంధించిన సరైన పేపర్ లు లేకపోతే వాహనాలు సీజ్ చేస్తామని, మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపటం, ట్రిపుల్ రైడింగ్ నేరమని అందుకు చలాన్లు వేయడం జరుగుతుందని తెలిపారు, యువత డ్రగ్స్, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలిపారు, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని పిల్లల రోజు వారి కార్యకలాపాలను గమనించాలని తెలిపారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువత క్రికెట్ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని, ఆన్లైన్ గేమ్, బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలని కోరారు. ప్రతిరోజు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.