

చిలిపి చెడు ఎస్సై నర్సింలు
జనం న్యూస్ మార్చ్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లపై యాప్స్ ల ద్వారా ఎవరైనా బెట్టింగ్ లకు, అసాంఘిక కార్యకలాపాలకు, పాల్పడితే చర్యలు తప్పవని చిలిపి చెడుఎస్ఐ నరసింహులు హెచ్చరించారు. బుధవారం, చిలిపిచెడ్ మండల ప్రజలను ఉద్దేశించి. ప్రస్తుత కాలంలో బెట్టింగ్ యాప్స్ తో, ఆన్లైన్ బెట్టింగులు పెట్టి లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైన యువత ఆత్మహత్యలకు,, పాల్పడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నామన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రధానంగా తమ పిల్లలు ఏమి చేస్తున్నారో విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. బెట్టింగ్ వ్యవహారంలో యువకులు ఎక్కువగా పాల్గొంటున్నారని తెలియజేశారు.అవసరాలకు మించి వారికి డబ్బులు ఇవ్వకూడదని సూచించారు. సరదాగా మొదలైన బెట్టింగ్ వ్యసనంగా మారుతుందని అన్నారు. మండలంలో ఎక్కడైనా ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే 100కు డయల్ చేయాలని లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మొబైల్ ఫోన్లో బెట్టింగ్ యాప్ ఉన్న, ఎలాంటి బెట్టింగ్ చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో బెట్టింగ్లకు పాల్పడే వారి సమాచారాన్ని అందించాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్సై నర్సింలు తెలియజేశారు.