Listen to this article

బిచ్కుంద మార్చి 26 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు ఈరోజు యాంటీ నార్కెటిక్ బ్యూరో ఉమ్మడి నిజామాబాద్ డిఎస్పి ఎం.సోమనాథం కళాశాలను సందర్శించి డ్రగ్స్ రహిత సమాజమే తెలంగాణ ధ్యేయం అను గోడపత్రులను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మత్తుపదార్థాల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. స్టెరాయిడ్స్ మరియు మద్యం, ధూమపానం లాంటి వ్యసనాలకు యువత బానిసకావద్దని కళాశాల ప్రిన్సిపల్ కె .అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో సిఐ పూర్ణేశ్వర్, అధ్యాపకులు రఘునాథ్, సంజీవరెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.