

జనం న్యూస్ మార్చి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువత విద్యార్థులు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ లకు అలవాటు పడి అప్పుల పాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని కోదాడ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్ కు పాల్పడి ఆన్లైన్ గేమ్స్ ఆడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అన్న భ్రమలో యువత విద్యార్థులు బెట్టింగ్ యాప్స్ కి బానిసలుగా మారి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకొని విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా పెట్టి తప్పుడు మార్గంలో పయనించకుండా జాగ్రత్త వహించాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలపై కోటి ఆశలతో రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్నతమైన విద్యలు చదివించి ఉద్యోగాలలో స్థిరపడతారని ఆశతో ఉన్నారని అలాంటి గొప్ప తల్లిదండ్రుల ఆశలు నిరాశలు చేయవద్దని యువతకు పిలుపునిచ్చారు. యువత పెడదారిని వదిలి సన్మార్గంలో నడిచి తల్లిదండ్రుల, పెద్దల గురువుల మాటలు విని ప్రయోజకులుగా ఎదగాలన్నారు.పిల్లలు ఉన్నత శిఖరాలలో కూర్చున్నప్పుడే తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా మనల్ని గౌరవిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రణయ్,బాలు, సురేషు,తదితరులు పాల్గొన్నారు.