

జనం న్యూస్ మార్చి 26(నడిగూడెం)
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చలో సూర్యాపేట పోరుబాట కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాకు మండల సిపిఎం కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు భారీ స్థాయిలో తరలి వెళ్లారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేంతవరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ కొరట్ల శ్రీనివాస్, ఎస్.కె మస్తాన్,రేఖ తిరపయ్య, కేసగాని భద్రయ్య, సంపత్ పిచ్చయ్య, ముసుకు వీరస్వామి, కందుల సంజీవరావు, కిన్నెర వెంకన్న, ప్రజా సంఘాల నాయకులు,మహిళలు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.