Listen to this article

జనం న్యూస్ -మార్చ్ 27- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-

దేవాలయాలు సంస్కార నిలయాలని హనుమాన్ శక్తి జాగరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మురళీ గురుస్వామి అన్నారు. తిరుమలగిరి (సాగర్) మండలం యల్లాపురం కొంపెల్లి గ్రామాలలో ధర్మ రక్షా ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనుముల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన దేవాలయాలకు ధూప దీప నైవేద్యం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పూజా సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, దేవాలయాల రక్షణ ప్రతిఒక్క హిందూ సమాజం బాధ్యత అని, వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన దేవాలయాలు చాలా శక్తివంతమైనవని, వాటి రక్షణలో హిందూ యువత ముందుండాలని, దేవాలయాలకు వచ్చి గొంతెమ్మ కోరికలు కోరుకోవడం మాత్రమే కాదు ఆ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ప్రతీ గ్రామంలో శిథిలావస్థలో ఉండి ధూప దీప నైవేద్యానికి నోచుకోని ఆలయాలకు ధర్మ రక్షా ఫౌండేషన్ వారు పూజా సామాగ్రి పంపిణీ చేస్తూ ఆ గ్రామస్తులలో ఒక చైతన్యం తీసుకొచ్చి తిరిగి పునరుద్ధరణ చేయడంలో వారి కృషి గొప్పదని, ఇది ఆ భగవంతుడు వారికి అప్పగించిన బాధ్యత అని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగాలని ఆకాంక్షించారు. ఫౌండేషన్ అధ్యక్షులు అనుముల నవీన్ కుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలను ఆదుకోవడమే కాకుండా దేవాలయాలకు ధూప దీప నైవేద్యం కార్యక్రమం నిర్వహించడం ఆ భగవంతుడు తనకు అప్పగించిన బాధ్యత అని తప్పక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిర్విరామంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని, ఇందుకోసం దాతల సహకారం అవసరమని, తమవంతుగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారు కొమ్ము రాందాస్, ఫౌండేషన్ కార్యదర్శిలు గుండాల లక్ష్మయ్య, గణేష్ తంగరాజు, తిరుమలగిరి మండల భాజపా మాజీ అధ్యక్షులు కోట్ల నర్సింహా రెడ్డి, మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గురుస్వామి గోవింద్, మంచికంటి మురళి, రామకృష్ణ మరియూ గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.