Listen to this article

యూత్ కాంగ్రెస్ హుస్నాబాద్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ శనిగరపు సాహూ.

జనం న్యూస్ 26 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)

హుస్నాబాద్ కి శాతవాహన యూనివర్సీటీ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తూ జీవో నెంబర్ 18 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఇందుకుగాను 44. 12 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్కకి, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తరుపున
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని యూత్ కాంగ్రెస్ హుస్నాబాద్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ శనిగరపు సాహు అన్నారు, ఈ సందర్భంగా సాహు మాట్లాడుతూ. స్వరాష్ట్ర ఏర్పాటు నుంచి వ్యవసాయ రంగానికి నీరు, విద్య రంగాన్ని, అభివృద్ధిలో చేసిన దాఖలు లేవని అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య ,వైద్యము, ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో నూతన ప్రభుత్వంగా ఏర్పడిన సంవత్సరాలలోపు 59000 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని అన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్ నియోజకవర్గ శాసనస భ్యులుగా గెలిచిన తర్వాత విద్యా సంస్థలు కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పటికే శంకుస్థాపన చేయడమైందని అన్నారు భీమదేవరపల్లి మండలంలో నవోదయ స్కూల్ ప్రపోజల్ లో ఉందని ఎల్కతుర్తి మండలంలో ట్రిపుల్ఐటీ అక్కన్నపేట, భీమదేవరపల్లి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్స్ నెలకొల్పుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మంత్రి కోట నుండి సిసి రోడ్లు డ్రైనేజ్ నిర్మాణాలకు సంఘ భవనాలకు అభివృద్ధి లక్ష్యంగా నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు ఎల్కతుర్తి మండల కేంద్రంలో త్రిబుల్ఐటీ విద్య సంస్థ నెలకొల్పడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని మరియు ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు జరుగుతున్నప్పటికీ తదితర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలకు ప్రపోజల్ లో ఉన్నాయని అన్నారు అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి శాతవాహన యూనివర్సిటీ అనుబంధంతో ఇంజనీరింగ్ కళాశాల హుస్నాబాద్ నియోజకవర్గంలో నెలకొల్పడం చాలా హర్షించదగ్గ విషయమని ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు కోసం కృషిచేసిన రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నామని శనిగరపు సాహూ అన్నారు.