

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బొంకూరి రాజు..
జనం న్యూస్ 26 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి బొంకూరి రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు ఏప్రిల్ 5 వరకు మాత్రమే ఉండడంతో కులము ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో యువత దరఖాస్తు చేసుకున్నారు తాసిల్దార్ కార్యాలయంలో పని భారంతో ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలి అన్నారు.
రేషన్ కార్డు లేని యువత ఆందోళన చెందుతున్నారు కావున వారికి అవకాశం కల్పించాలి
గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంపిక కాబడిన లబ్ధిదారులకు ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు
తక్షణమే వారికి నిధులు మంజూరు చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలి. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో నిధులు మంజూరు చేసి బడుగు బలహీన వర్గాల యువకుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు బ్యాంకు లింకేజీ వలన బీసీ ఎస్సీ ఎస్టీ యువకులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి కార్పొరేషన్ల ద్వారా నేరుగా యూనిట్లు గ్రౌండింగ్ జరిగేలా చూడాలి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఈ సందర్భంగా బొంకూరి రాజు అన్నారు.