

సుందరీకరణ పేరుతో 70 ఏళ్ల నాటి వృక్షాల తొలగింపు
జనం న్యూస్ -మార్చి 27- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని తెలంగాణ టూరిజంకు చెందిన ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ ను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు, లీజుకు తీసుకున్న వ్యక్తులు ప్రాజెక్ట్ హౌస్ లో ఉన్న సుమారు 70 సంవత్సరాల నాటి వృక్షాలను సుందరీకరణ పేరుతో తొలగించారు, అటవీశాఖ అధికారుల నుంచి గార్డెనింగ్ అనుకూలంగా అనుమతులు తీసుకొని ప్రహరీ గోడ వెంట ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను తొలగిస్తున్నారు , సదరు లీజుకు తీసుకున్న ప్రైవేటు వ్యక్తులు తాము గ్రీనరీ కోసం చెట్లను తొలగించామని చెబుతున్నారు, గ్రౌండ్ గ్రీనరీ కోసం నీడనిచ్చే70 సంవత్సరాల నాటి వృక్షాలను తొలగించాల్సిన అవసరం ఏంటని ప్రకృతి ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు, ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చెట్లను తొలగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
పార్క్ గ్రీనరీ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు -ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పగడాల నాగరాజు అనే వ్యక్తి పార్క్ గ్రీనరీ కోసం ఆన్లైన్ లో చెట్లు తొలగింపుకు దరఖాస్తు చేసుకున్నారని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ తెలిపారు.
