

జనం న్యూస్, మార్చి 27,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఇటుక బట్టీల నిర్వహణలో నిబంధనలు పూజా తప్పకుండా పాటించాలని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య అన్నారు.బుధవారం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య పెద్దపల్లి పట్టణంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో ఇట్టుక బట్టిల ఓనర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటుక బట్టీల ఓనర్లతో సంబంధిత శాఖ అధికారులు అవగాహన సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ నిబంధనలు, ఉత్తర్వులు, ఇటుక బట్టీల నిర్వహణలో పాటించాల్సిన విధి విధానాలపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. పెద్దపల్లి డివిజన్ లో ఉన్న ఇటుక బట్టీల ఓనర్లు ప్రభుత్వ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా పరిశ్రమల అధికారి , మైనింగ్ శాఖ ఉప సంచాలకులు, లేబర్ అధికారి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
