

జనం న్యూస్, మార్చి 27, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఏప్రిల్ 5 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద మైనారిటీ నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జే. రంగారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీస్ (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ద్, జైన్ , పార్శి) చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిందని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం ఫోటో ,స్టడీ సర్టిఫికెట్, మొబైల్ నెంబర్, రవాణా రంగ పథకాల కోసం శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ పథకాల కోసం పట్టాదార్ పాస్ పుస్తకం, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, హనీ కలిగించే సమూహ ధృవీకరణ పత్రాలతో ఆన్ లైన్ నందు దరఖాస్తుల సమర్పించాలని అన్నారు.వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 55 సంవత్సరాల వయసు గల వారు, వ్యవసాయ అనుబంధ పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల వయసు గల వారు అర్హులని, మీరు ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 50 వేల రూపాయల, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల లోపు ఉండాలని అన్నారు. గత 5 సంవత్సరాలుగా మైనారిటీ కార్పోరేషన్ /ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద మైనారిటీ నిరుద్యోగులను స్వయం ఉపాధి పథకాలు అందించడానికి ప్రణాళిక ఆమోదించిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆసక్తి అర్హత గల నిరుద్యోగ మైనారిటీ యువత ఆన్ లైన్ పోర్టల్ https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ నందు ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని , మరిన్ని వివరాలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ నందు గల మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.