Listen to this article

పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దారవత్ రవి, పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి కామల్ల ఉదయ్

బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పరాయి పాలనను ఎదిరిస్తూ నవ యవ్వన ప్రాయంలో దేశ స్వాతంత్ర్యం, సమానత్వంకై ఉరికంభమెక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా పి డి ఎస్ యు, పివైఎల్ ఆధ్వర్యంలో మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దారవత్ రవి, పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి కామల్ల ఉదయ్ మాట్లాడుతూ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు మరణం దేశ ప్రజలను ఎంతో చైతన్యపరిచి విప్లవ తిరుగుబాటుతోనే దేశానికి స్వాతంత్రం వస్తుందని రుజువు చేశారు. వారు ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్ ఇప్పటికీ, ఎప్పటికీ విద్యార్థులు యువకులు విప్లవ పోరాటాలు నిర్మించడానికి వెలుగు రేఖై నిలుస్తుంది. మనదేశంలో భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో నేటి విద్యార్థి, యువతరం పోరాడాల్సిన కర్తవ్యం మరింత పెరుగుతూ వస్తున్నది అని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న పాలకులు యువతను యువశక్తిని మానవ శక్తిని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. ప్రభుత్వాలు, పాలకవర్గాల విధానాలతో సామ్రాజ్యవాదం నేడు విశృఖళంగా విజృంభిస్తుందని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం రోజు రోజుకు బుసలు కొడుతూ విషం చిమ్ముతున్నది, అమెరికా నూతన అధ్యక్షుడుగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విదేశీ యువతీ, యువకులను నిర్ధాక్షణ్యంగా సంకెళ్లు వేసి వారి దేశాలకు గెంటివేస్తున్నారు ట్రంప్ దృహంకారాన్ని ప్రశ్నించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ కనీసం మాట్లాడకపోవడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ మతోన్మాద విధానాలతో దేశ ప్రజలను విచ్చిన్నం చేస్తున్నారు, దేశాన్ని ఫాసిస్టు రాజ్యంగా మార్చడానికి పూనుకుంటున్నారని అన్నారు. మతం ముసుగులో దేశభక్తి పేరుతో రాజ్యాంగాన్ని మార్చి రాజరికపు వ్యవస్థను నెలకొల్పే ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాకు వ్యతిరేకంగా విద్యార్థులు యువజనలు విప్లవ పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగం రోజురోజుకు రెట్టింపు అవుతుందని, ఒక పక్క గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు, మద్యం, మత్తుపదార్థాలు యువతను, సమాజాన్ని కలుషితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల పోరాట స్ఫూర్తితో మన దేశ భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత విద్యార్థి యువతరం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా నాయకులు పొన్నం బ్రహ్మం, పిడిఎస్యు నాయకులు చరణ్, హరి, మురళీ కృష్ణ, సిద్దు, లోకేష్, విఘ్నేష్, రాజు, వినయ్, తదితరులు పాల్గొన్నారు.