

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలో వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధినుల ఆత్మ రక్షణకు అవసరమైన ళుకువలను
విద్యార్థులకు శక్తి టీమ్స్ నేర్పుతూ, వారిలో చైతన్యం నింపుతూ, ఆపద సమయాల్లో ఎటువంటి ఆందోళన చెందకుండా స్పందించేందుకు అవసరమైన మానసిక పరిపక్వత విద్యార్థులు పొందేందుకు ‘శక్తి టీమ్స్’ చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మార్చి 26న తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – మహిళలు, విద్యార్ధినులు తమ రక్షణకు స్వయంగా వారే స్పందించే విధంగా అవసరమైన సెల్ఫ్ టెక్నిక్స్ ను ‘శక్తి టీమ్స్’ నేర్పుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. శక్తి యాప్ పట్ల విద్యార్ధినులు, మహిళలకు అవగాహన కల్పించుటలో భాగంగా శక్తి టీమ్స్ కళాశాలలు, పాఠశాలలను సందర్శించే సమయంలో విద్యార్ధినులతో శక్తి టీమ్స్ మమేకమై, కొన్ని సెల్ఫ్ టెక్నిక్స్ ను వారికి నేర్పుతూ, శిక్షణ ఇస్తున్నారన్నారు. ఏదైనా ఆపద సమయం ఏర్పడినపుడు, మహిళల రక్షణకు విఘాతం కలిగే సంఘటన చోటు చేసుకున్నపుడు మహిళలు, విద్యార్ధినులు భయపడకుండా, పరిస్థితిని అర్ధం చేసుకొని, వాటిని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యే విధంగా విద్యార్ధినులు అప్రమత్తం కావాలన్నారు. సమస్య నుండి బయట పడేందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందడుగు వేయాలని, ఎవరైనా అనుమానస్పదంగా అనుసరిస్తున్నారని భావిస్తే, జనం ఉన్న ప్రదేశాల్లోకి వెంటనే వెళ్ళేందుకు ప్రయత్నించడం, ఇతరుల సహాయం పొందే విధంగా బిగ్గరగా అరవడం చేయాలన్నారు. అగంతకులు దాడికి పాల్పడే సమయాల్లో ఆత్మ రక్షణ కొరకు ఎదురు దాడికి దిగి, దాడికి పాల్పడిన వ్యక్తుల సున్నితమైన భాగాలను లక్ష్యంగా చేసుకోవాలని, కళ్ళలో కొట్టడం, ముక్కుపైన గుద్దడం, కాళ్ళ మధ్య భాగంలో తన్నడం చేయాలన్నారు. ఆత్మ రక్షణకు కొన్ని సెల్ఫ్ టెక్నిక్స్ ను విద్యార్ధినులు, మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ప్రతీ మహిళ తమ మొబైల్ ఫోనులో తప్పనిసరిగా శక్తి యాప్ ను డౌన్లోడు చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112/100, శక్తి యాప్ లోని ఎస్.ఓ.ఎస్. బటన్ ను ప్రెస్ చేయాలన్నారు. మొబైల్ ఫోన్లులో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే మీకు రక్షణగా ఒక కుటుంబ సభ్యుడు మీతో ఉన్నట్లేనన్నారు. ఆపద సమయంలో శక్తి యాప్ లోని ఎస్.ఓ.ఎస్. బటన్ ను ప్రెస్ చేస్తే, వారున్న ప్రాంతం వివరాలను, 10 సెకన్ల ఆడియో, వీడియోలను దగ్గరలో ఉన్న పోలీసు స్టేషనుకు చేరుతుందని, తద్వారా పోలీసులు అప్రమత్తమై, వారున్న ప్రాంతానికి క్షణాల్లో చేరుకొని, మహిళలకు రక్షణగా నిలుస్తారన్నారు. కావున, ప్రతీ ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లులో శక్తి యాప్ ను డౌన్లోడు, రిజిస్ట్రేషను చేసు
కోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ విద్యార్థినులు, మహిళలకు విజ్ఞప్తి చేసారు.