

జనం న్యూస్ 27 మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమల శంకర్)
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించినారు, ఫలితం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పాటు సంతోషకరం, కానీ నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్ర క్యాబినెట్లో ముస్లిం, మరియు, లంబాడి సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇవ్వలేదు, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల ప్రజల శ్రేయస్సు కోరుతూ త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ముస్లిం మరియు లంబాడి సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇవ్వాలి