

ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం
జనం న్యూస్ ; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి:27 మార్చ్ గురువారం; సిద్దిపేట
ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల అర్థశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం కళాశాల ప్రాంగణంలో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు విద్య ద్వారానే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు పెంచేలా ఉన్నత విద్యలో సమూలమర్పులు రాబోతున్నాయని,వీటిని సామాజికంగా వెనుకబడిన వర్గాలు అందుకున్నప్పుడే ప్రయోజనం ఉంటుందని సూచించారు.ప్రధాన వక్త కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి మాట్లాడుతూ ప్రపంచీకరణ,కార్పొరేటీకరణ నేపథ్యంలో సామాజిక అంతరాలు మరింతగా పెరుగుతున్నాయని వాటిని అధిగమించేందుకు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.రాష్ట్ర ఎస్సీ,ఎస్టి కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య మాట్లాడుతూ సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్న అట్టడుగు వర్గాల సమస్యల మీద చర్చ జరగడానికి ఈ సదస్సు ఉపయోగ పడుతుందని అర్దవంత మైన సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని వివరించారు.ఈ కార్యక్రమంలో దరువు ఎల్లన్న ఉద్యమ పాటలతో విద్యార్థిని విద్యార్థులను అలరించారు ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేశారు. మ్యాజిక్ రమేష్ ఇంద్రజాల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.
సదస్సుకు వివిధ రాష్ట్రాలనుండి 60 పరిశోధన పత్రాలు వచ్చాయని సదస్సు కన్వీనర్ డా శ్రద్ధనందం తెలిపారు.ఈ కార్యక్రమంలో డా.కె.దివ్య పాల్గొని మాట్లాడారు.సదస్సుకు వచ్చిన అతిథులకు కాళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి సునీత కృతజ్ఞతలు తెలియజేశారు,సదస్సులో డా.అనురాధ తో పాటు అధ్యాపకులు,విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.