

జనం న్యూస్ మార్చి 27 (ముమ్మిడివరం ప్రతినిధి)
కాట్రేనికోన మండల కేంద్రమైన కాట్రేనికోనలో మార్కెటింగ్ యార్డు సమీపంలో జరుగుతున్న పేకాటపై వచ్చిన సమాచారం మేరకు గురువారం పోలీసులుదాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ 1310 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఐ అవినాష్ వివరించారు.