Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 27

ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మార్కాపురం ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్య కర్తలకు పోషన్ భీ, పడాయి బీ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ బి. సుశీలదేవి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు 3 వ రోజు శిక్షణలో భాగంగా పోషన్ భి పడాయి భి, దివ్యాంగ పిల్లల కు మరియు వైకల్యం గురించి, చిన్నపిల్లల ఆధారిత సంరక్షణ ఈసీసీఈ వాట్సాప్ ల సహాయంతో నిత్యం నేర్పటం వల్ల వారి మానసిక మరియు మేధాశక్తి అభివృద్ధి చెందుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అటు మానసిక అభివృద్ధి మాత్రమే కాకుండా, విద్యను సరళంగా అర్థం చేసుకునేలా చేయడంలో కూడా ఆటలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆటల ద్వారా పిల్లలు విషయాలను వేగంగా అర్థం చేసుకోవడమే కాకుండా, శ్రమశీలత, సహకారం, ఏకాగ్రత వంటి నైపుణ్యాలను కూడా అలవర్చుకుంటున్నారు. ఈ శిక్షణా తరగతుల్లో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు పాల్గొని, నేర్చుకున్న పద్ధతులను తరగతి గదుల్లో అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు ఈ కార్యక్రమం లో అంగన్వాడీ కార్యకర్తలు సూపర్ వైజర్స్ పాల్గొన్నారు