

టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సి బోర్డు ముట్టడి..
జనం న్యూస్ // మార్చ్ // 27 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట )..
రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకు అవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సి బోర్డు ముట్టడించారు. కాగా టిఆర్ఎస్వి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సీమాంధ్ర కార్పొరేట్ విద్య సంస్థలతో కుమ్మక్కై పదవతరగతి ప్రశ్నపత్రాలు అమ్ముకున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యాశాఖ తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి పరీక్షలకు ముందు విద్యాశాఖ రివ్యూ నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించడం వల్లే నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్, జూకల్ లో పేపర్ లీగ్ జరిగిందని అన్నారు. రేపల్లె కేసులకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ బాధ్యుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు పరీక్షలు నిర్వహిస్తే నాలుగు ప్రశ్నపత్రాలు లీకవ్వడం చూస్తుంటే విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది అని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలతో కుమ్మక్కై కాంగ్రెస్ ఎమ్మెల్యేలే లీకులకు పాల్పడుతుండడం సిగ్గుచేటు అని అన్నారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించమని కోరితే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కేటీఆర్ పై నకరికల్ లో అక్రమ కేసు పెట్టారని అన్నారు. పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము న్యాయపరంగా కొట్లాడుతామని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని మేము అధికారంలోకి వచ్చాక అన్ని తేలుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తుంగబాలు, కడార స్వామి యాదవ్, చటారీ దశరథ్, కాటన్ శివ, నర్సింగ్ శ్రీను నాయక్, మిద్దె సురేష్, శ్రీకాంత్ ముదిరాజ్, కల్వ నితీష్,సాయిగౌడ్, రాకేష్, రెహమత్ తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
