Listen to this article

జనంన్యూస్ 27. నిజామాబాదు. ప్రతినిధి.

అసెంబ్లీ సాక్షిగా సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి. సోమవారం రోజున జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. మధ్యకాలంలో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మాఫియా విస్తృతంగా జరుగుతున్నాయి అని మాట్లాడటం జరిగింది.అనేకమంది మధ్యతరగతి యువత ఈజీ మనీకి అలవాటుపడి ఈ బెట్టింగ్ ఊబిలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని యువత ఈ యాప్స్ వలన పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయి ఆర్ధికంగా, మానసికంగా క్రుంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని దాని కారణంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఈ మధ్య ఒక మీడియా పత్రికలో ఒక మాజీ మంత్రి ప్రమేయంతో ఈ యాప్స్ నిర్వాహణ జరిగిందని వస్తున్నా కథనాలపై విచారణ జరపాలని ప్రభుత్వం కేవలం కొందరు ప్రమోటర్లకు నోటీసులు పంపి కేసులు బుక్ చేసి చేతులు దులుపుకోవడానికే పరిమితం కాకుండా అసలైన దోషులను గుర్తించి ముఖ్యంగా యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో డ్రగ్స్ కేసు నిరుకార్చినట్టు కాకుండా ఈ బెట్టింగ్ మాఫియా పై పూర్తి స్థాయి విచారణ జరపాలని దోషులు ఎంతటి వారినైనా ఉపేక్షిచకుండా చర్యలు తీసుకొవాలని అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు బుధవారం అసెంబ్లీలో సిట్ వేసి విచారణకు ఆదేశించడం జరిగింది. బెట్టింగ్ యాప్ ల నుండి యువతను రక్షించాలని బెట్టింగ్ యాప్ ఓనర్లపై చర్యలు తీసుకోవాలన్నా డిమాండ్ కు స్పందించి ముఖ్య మంత్రి గారు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించడం పట్ల ఎమ్మెల్యే ధన్ పాల్ గారు ధన్యవాదాలు తెలిపారు.