Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 27 // కుమార్ యాదవ్ (జమ్మికుంట)

జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలం వాయిదా పడినట్లు పంచాయతీ కార్యదర్శి కే తారకరామారావు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దారించిన ధర రాకపోవడంతో ఈ నెల 29న 12:00 గంటలకు మళ్ళీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో కొత్తగా పాల్గొనదలిచిన వారు ఈ నెల 29న ఉదయం 10: 00 గంటల వరకు రూ. 5000 చిన్న షెటర్ గాను 10000 పెద్ద షెటర్ గాను డిపాజిట్ చెల్లించాలని డిపాజిట్ చెల్లించిన వారు మాత్రమే వేలంలో పాల్గొననుటకు అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో భీమేష్ ఎంపిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.