Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 27 // కుమార్ యాదవ్ (జమ్మికుంట)..

జమ్మికుంట మండలం కొత్తపల్లిలోని స్పందన అనాధాశ్రమంలో పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రభాకర్ గౌడ్ తనయుడు సిద్ధాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు పీఎంకే ఫౌండేషన్ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు.పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు స్పందన అనాధాశ్రమంలో పీఎంకే ఫౌండేషన్ చైర్మన్ ప్రభాకర్ గౌడ్ కుమారుడు సిద్ధాంత్ గౌడ్ జన్మదిన వేడుకలను, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి స్పందన అనాధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవి గౌడ్, గండి రంజిత్ కుమార్ గౌడ్, బండారి శ్రీనివాస్ యాదవ్, తాటిగంటి వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.