

జనం న్యూస్, మార్చ్ 28, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
రామగిరి ప్రతీ మహిళా స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి చెందాలని వారి ఆర్థిక అభివృద్ధికి అండగా నిలబడుతామని రేండ్ల శారద కుమారస్వామి తెలిపారు. గురువారం ఆర్ ఎస్ కె ఆపన్నహస్తం ద్వారా నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ తరగతులను పరిశీలించారు.రేండ్ల శారద కుమారస్వామి దంపతులు తమ స్వంత ఖర్చులతో మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్ల కొరకు ఎన్ ఎ సి ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి మహిళ తమ సొంత కాళ్లతో నిలుదొక్కుని ఆర్థిక చేయూతను పొందాలని అన్నారు. ఎవరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొంది వారి కుటుంబాలకు అండగా ఉండాలన్నారు. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా వారి వెంట ఉంటామని నిత్యం మీకు అండగా నిలుస్తామని ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు తోడుగా నిలుస్తామన్నారు. ఎన్ ఎ సి ఆధ్వర్యంలో మొత్తం 300 మందికి శిక్షణ నిర్వహించగా గురువారం రెండవ బ్యాచ్ 30 మందికి పరీక్ష నిర్వహించారు. అనంతరం వీరికి సర్టిఫికెట్స్ ను ప్రదానం చేయడం జరుగుతుందన్నారు.
