Listen to this article

జనం న్యూస్ మార్చి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని


రహదారుల పక్కన తీసిన టి ఫైబర్ గుంతలు ఆరు నెలలుగా పూడ్చి వేయకపోవడంతో ప్రయాణికులకు ప్రాణ సంకటనగా మారింది

చిలిపి చెడు మండలంలో రహదారుల పక్కన, తీసిన టీ ఫైబర్ గుంతలు ఆరు నెలలుగా తరబడిపూడ్చివేయకపోవడంతో ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడంతో నిత్యం ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకెళితే చిలిపి చెడు మండలంలోని ఫైజాబాద్ గేటు ప్రయాణ ప్రాంగణం ముందు, మరియు చిట్కుల్, దౌల్తాబాద్ రోడ్ పక్కన ఒక మీటర్ దూరంలో టి ఫైబర్ గుంత తీసి వదిలేశారు. ఆరు నెలల తరబడి తీసిన కేబుల్ గుంతలు పూడ్చి వేయకపోవడంతో, నిత్యం ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రింబవళ్లు రద్దీగా తిరిగే ఈ రహదారి పైన ప్రయాణికులకు ప్రయాణం ప్రాణ సంకటనగా మారింది. గుంతలు తీసిన వెంటనే కేబుల్ వేసి పూడ్చివేయాల్సిన కాంట్రాక్టర్ గుంతలను, గానికి వదిలి వేయడంతో నిత్యం కేబుల్ గుంతల్లో పడి ప్రయాణికులు ఆస్పత్రుల ఫాలు అవుతున్నారు. మండల అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ రహదారిపై నిత్యం ప్రయాణం చేస్తున్న, చోద్యంగా చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై, ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గుంతలు తీసిన కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోని గుంతలు అన్నింటిని పూడ్చివేసే విధంగా యుద్ధ ప్రతిపాదికన, చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు