Listen to this article

ఏన్కూరు మండల క్రైస్తవ బోధకులు

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 27 :

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి ఏన్కూరు మండల క్రైస్తవ బోధకులు సంతాపం తెలిపారు. స్థానిక ఏన్కూరు ఎస్ సి ఎ ప్రార్థనా మందిరంలో మండల అధ్యక్షులు పాస్టర్ కే శౌరి ఆధ్వర్యంలో మండలములోని క్రైస్తవ సేవకులు సమావేశమయ్యారు పాస్టర్ అద్భుత కుమార్ మాట్లాడుతూ రాజమండ్రి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ మరణ విషయం యావత్ క్రైస్తవ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని వారి మరణము అనేక అనుమానాలకు తావుతీస్తుందని సమగ్ర విచారణ జరిగించి నిజాలు క్రైస్తవ లోకానికి వెల్లడి చేయాలని క్రైస్తవ సేవకులు డిమాండ్ చేశారు. పాస్టర్ జాన్ పాల్, పాస్టర్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ హోం మంత్రి అనిత చొరవ తీసుకొని నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని కోరారు. పాస్టర్ తిమోతి పాస్టర్ ప్రవీణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.సేవకులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలములోని సేవకులు పీటర్, అనిల్, ప్రకాష్, నాని, రాజ్, స్వరాజ్,సైమన్, జాషువా,సురేష్, మార్క్ తదితరుల పాల్గొన్నారు.