Listen to this article

జనం న్యూస్ మార్చి 27:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలకేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఎం శ్రీ పథకం లోభాగంగా గురువారం రోజునా జగిత్యాల జిల్లాలోని పొలాస లో ఉన్న ప్రొపెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. వ్యవసాయంలోని కొత్త మెలకువలను, కొత్త వంగడాల నైపుణ్యతను అక్కడి ప్రొఫెసర్లను అడిగి తెలుసుకున్నారు. విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న వివిధ పంటలను విద్యార్థులు సందర్శించారు. అక్కడి అధికారులు విద్యార్థులకు మూడు కాలాలలో వచ్చే పంటల గూర్చి వాటి సంరక్షణ గూర్చి విద్యార్థులకు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ ఇలాంటి క్షేత్ర పర్యటన వల్ల విద్యార్థులు వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకుంటారని, వ్యవసాయ ప్రయోజనాలు తెలుసుకుంటారని తెలిపారు. ఈ క్షేత్ర పర్యటనలో పాఠశాల ఉపాధ్యాయులు మునీరుద్దీన్, ప్రసాద్, విజయ్, గంగాధర్, ఎస్.శ్రీనివాస్, ప్రవీణ్ శర్మ, కే.శ్రీనివాస్, ట్వింకిల్, గంగా మోహన్, నరేష్, సబిత, జ్యోతి ,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగరాణి పాల్గొన్నారు