Listen to this article

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం)

నడిగూడెం గ్రామానికి చెందిన నిర్మాణ రంగా కార్మికుడు దేవరంగుల ఎల్లయ్య అకాల మృతి చెందడంతో ఆ సంఘం నాయకులు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ ఎల్లయ మృతి సంఘానికి తీరనిలోటని సంఘం కార్యదర్శిగా తన సేవలు మరువలేని అని గుర్తు చేశారు. ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని వెల్ఫేర్ బోర్డు నిధులను విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వెల్ఫేర్ బోర్డు క్లైమ్ లకు తక్షణమే నిధులు కేటాయించాలని, ప్రస్తుత ఇస్తున్న ప్రమాద బీమా 6 లక్షలను 10 లక్షలకు పెంచాలని సహజ మరణానికి ఇస్తున్న లక్షణం ఐదు లక్షలగా చేయాలని, ప్రసూతి పెళ్లి కానుక దాన సంస్కారాలకు ఇచ్చే 30 వేలను లక్ష రూపాయలుగా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మల్లె ఎంకన్న భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి చల్లా జయకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పల్లపు తిరుమలేష్, వల్లెపు శ్రీనివాస్, ఒగ్గు సైదులు, జడ్డు బాలశౌరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చిక్కుళ్ళ ఉపేందర్, నూసిన వెంకన్న, గుంజ వెంకన్న, గోలి వీరబాబు, నోసిన సోమయ్య,రమేష్, రాములు, నార్ల శ్రీను, గొల్లపూడి వెంకన్న, రామకృష్ణ మహమ్మద్ గణేష్ నకరికంటి అంజయ్య ప్రవీణు కర్ణాకర్ అంజి శ్రీను మోసిన తదితరులు పాల్గొన్నారు.