Listen to this article

త్రైత సిద్ధాంత విశ్వావసు నామ సంవత్సరం క్యాలెండర్ల ఆవిష్కరణ..

ఆవిష్కరిస్తున్న ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్..

జనం న్యూస్ 27 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)

ఎల్కతుర్తి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో త్రైత సిద్ధాంత విశ్వావసు నామ సంవత్సరం త్రైత శకం 47వ సంవత్సరం తెలుగు యుగాది క్యాలెండర్లను గురువారం రోజున ఎంపీడీవో ఎన్ విజయ్ కుమార్ ప్రత్యేక అధికారి చేతుల మీదుగా తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. త్రైత సిద్ధాంత ప్రబోధా సేవ సమితి ఇందు జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి త్రైత సిద్ధాంత భగవద్గీత తెలుగు ఉగాది కాల సూచిక క్యాలెండర్ త్రైత శకం 47వను పంపిణీ చేశారు. అనంతరం అధ్యక్షులు సిద్ధాంతి మాట్లాడుతూ.సనాతన ధర్మాన్ని వెలుగులోకి తీసుకురావడమే మా ఉద్దేశం ఆత్మజ్ఞానము తెలుగు పండుగల విశిష్టత మరియు తెలుగు నెలల విశిష్టత త్రైత సిద్ధాంత భగవద్గీత శ్లోకముల సారంతో పాటు ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్న భగవద్గీత యొక్క సారాంశం ఇందులో పొందుపరచి స్వామి వారు రచించడం జరిగిందన్నారు. ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్ ప్రత్యేక అధికారి ఎంతో ఆసక్తిగా ఇలాంటి సాంప్రదాయాలు పూర్వీకుల కాలంలో ఉండేది ఈ కాల సూచికలో విషయాలను అడిగి తెలుసుకుని తెలుగు భాష కనుమరుగైపోతున్నటువంటి సమయములో స్వచ్ఛమైన త్రైత సిద్ధాంత భగవద్గీత మూడు మతాలకు అతీతంగా అందించిన శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రబోధా సేవ సమితి ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షుడు సదానిరంజన్ సిద్ధాంతి శ్రీరామోజు సతీష్ చారి, ఆఫీస్ సిబ్బంది సూపర్డెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, సభాఆర్డినేట్ కుమారస్వామి, ఆంధ్రప్రభ రిపోర్టర్ జనగాని ప్రవీణ్, జంపాల సురేందర్, పాల్గొన్నారు.