

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం)
నడిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దేవరంగుల ఎల్లయ్య మృతి అత్యంత బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ వద్ద ఉంచిన ఆయన మృతదేహాన్ని గురువారం సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేసేవాడన్నారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు, వారి వెంట నడిగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం మల్లేష్ యాదవ్, వల్లెపు శ్రీనివాస్, గుంజా తిరుమలేష్, పల్లపు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.