Listen to this article

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం)

మండలంలోని రత్నవరం రైతు వేదిక నందు నేడు ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్న
నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ సభ్యుల సర్వసభ్య సమావేశం సర్వజన సదస్సు ను జయప్రదం చేయాలని చైర్మన్ కొల్లు రామారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు, ప్రజలు సమావేశంలో పాల్గొని సంఘ అభివృద్ధికి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.