Listen to this article

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం)

మండలం లోని బృందావనపురం గ్రామంలో బొడ్డు లచ్చయ్య ఇంటిముందు ప్రమాదకరంగా ఉన్నా ఇంకుడు గుంతని వెంటనే పూడ్చి వేయాలి అని సిపిఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.గురువారం గ్రామంలోని ప్రమాదకరంగా ఉన్న గుంత ని గ్రామ ప్రజలతో కలిసి పరిశీలించి మాట్లాడా రు. చిన్నపిల్లలు, మూగజీవాలు గుంత లో పడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గుంతని మూసివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ కొరట్ల శ్రీనివాస్, శాఖ కార్యదర్శులు ముసుకు వీరస్వామి, బొడ్డు సత్యనారాయణ, చేపల అశోక్, వెంకటేశ్వర్లు, కొండ నరసమ్మ, బొడ్డు ప్రమీల, కాసాని కృష్ణవేణి, కొండా రేణుక తదితరులు పాల్గొన్నారు.