Listen to this article

జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా శక్తి కార్యక్రమం లో భాగంగా మహిళా సంఘాల సభ్యులచే బడి పిల్లల యూనిఫార్మ్స్ కుట్టడం కోసం గౌరవ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరువ తో అదనపు నిధుల నుండి జిల్లాలో 3 చోట్ల ఏర్పాటు చేయబడిన మహిళా టైలర్స్ శిక్షణ కొరకు 13 మండలాల మరియు అర్బన్ మహిళా సంఘాల సభ్యులకు శనివారం నుండి తేదీ (22/03/2025 -31/03/2025) నుండి నడుస్తున్న సుల్తానాబాద్ మండల సమాఖ్య కార్యాలయం నందు ఓదెల శ్రీరాంపూర్ ఎలిగేడు జూలపల్లి సుల్తానాబాద్ రూరల్ & అర్బన్ , కమాన్పూర్ శ్రీ ఆదివారహ టైలరింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ నందు పెద్దపల్లి కమాన్పూర్ రామగిరి ముత్తారం మంథని రూరల్ & అర్బన్ , ఎన్టీపీసీ, విక్టరీ ఫ్యాషన్ డిజైనర్ సంస్థ నందు వారి యొక్క శిక్షణ సంస్థ నందు అంతార్గం పాలకుర్తి ధర్మారం పెద్దపల్లి అర్బన్ రామగుండము అర్బన్ మండలాల వారికీ గత 7 రోజుల నుండి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సెంటర్ల లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమం గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు DRDO మేడం ఈరోజు పరిశీలించారు