

జనం న్యూస్ మార్చ్ 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ :కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 9 మాసాలలో 7500 కోట్లను ఉద్యోగస్తుల ఖాతాలకు జమ చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై ఉద్యోగస్తులకు నమ్మకం కలిగిందని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు హర్షం ప్రకటించారు. గత ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి పాలనలో ఉద్యోగస్తులు దాచుకున్న సొమ్మును 20 వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి వారి నోట్లో మట్టి కొట్టారని వారు దాచుకున్న డబ్బును వాళ్ళ అవసరాలకు తీసుకొనే అవకాశం లేకుండా నియంత పాలన చేసి వారి ఉసురు పోసుకున్నారని వెంకటరావు అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం, ఉద్యోగుల మ్యాచింగ్ 2300 కోట్లు బకాయిలను ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విడుదల చేయడం ఉద్యోగుల్లో మానసిక ధైర్యాన్ని కలుగజేసిందని వెంకటరావు అన్నారు. శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ దార్శినికుడైన చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారాధ్యంలో ఉద్యోగుల పక్షపాతని, సిపీఎస్ ఉద్యోగులు రాష్ట్ర ఎంప్లాయిస్ యూనియన్ అన్ని వర్గాలు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్యలను కొనియాడారని, భవిష్యత్తులో డిఏలు, పెండింగ్ డిఎ బకాయిలు పిఆర్సి నియామకంతో పాటు ఐఆర్ కూడా ప్రకటించి ఉద్యోగుల పక్షాన నిలవాలని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు తో పాటు సత్యనారాయణ వెంకటరావు ఎంతో ఆశతో ఉన్నారని అన్నారు. ఆరుగాలం కష్టపడిన పోలీసు ఉద్యోగస్తులకు వారు దాచుకున్న పిఎఫ్, సరెండర్ లీవ్ బకాయిలు, పెళ్లిళ్లకు, గృహ నిర్మాణాలకు, ఆరోగ్య అవసరాలకు, పిల్లలు చదువులకు స్వయాన ఆర్జీలు పెట్టుకున్న, వారు దాచుకున్న సొమ్ము వారికి ఇవ్వడానికి జగన్ రెడ్డి పాలనలో నానాయాతన పడి అప్పుల పాలయ్యారని వారందరికీ కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఆహ్లాదంగా నిధులు విడుదలతో ఉద్యోగస్తులు మురిసిపోతున్నారని వెంకటరావు సత్యనారాయణ కాశీ విశ్వేశ్వరరావు అన్నారు.