

బిచ్కుంద మార్చి 29 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో భద్రతాండా లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .5 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప మరియు బిచ్కుంద మఠాధిపతి సోమలింగ శివాచార్య మహారాజ్ తో కలిసి కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు ప్రారంభించారు.ఇట్టి కార్యక్రమంలో బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ ,బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు సాయిల్ , నౌషా నాయక్ , మాజీ ఎంపీటీసీ గుండెల్లో రాజు పటేల్ , గోపనపల్లి శంకర్ పటేల్ , తుకారం ఖలీల్, సొసైటీ డైరెక్టర్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు