

జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : ఈ రోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో పి.సి.పియన్.డి.టి. అడ్వైజరి కమిటి సమావేశంను డా. జి. అన్నా ప్రసన్నకుమారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కమీషనర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను స్పెషల్ డ్రైవ్ టీమ్ సభ్యులు తనిఖీ నిర్వహించారు అని అన్నారు. జిల్లాలో (31) స్కానింగ్ కేంద్రాలకు గాను 30 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. ఇందులో ఒక స్కాన్ సెంటరు సీజ్ చేయడం జరిగినది అని అన్నారు. 15 కేంద్రాలకు నోటీస్ లు జారీ చేశాము అని అన్నారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి మరియు టీమ్ సభ్యులు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం ను పకడ్బందిగా అమలు చేయుచున్నందుకు అడ్వైజరి కమిటీ సభ్యులు అభినందించారు మరియు సహకారాన్ని అందిస్తాము అని అన్నారు. ఈ సమావేశంలో డా.శ్రీధర్, డి.సి.హెచ్.ఎస్., డా. వి. వాణిశ్రీ, ప్రోగ్రామ్ ఆఫీసర్ (యం.హెచ్.ఎన్), డా. శ్రీదేవి , గైనకాలజిస్ట్, డా. రవీందర్ (పిడియాట్రిషియన్), శ్రీ కె. రాజగోపాల్, రెడ్ క్రాస్ సోసైటి, అద్యక్షులు, శ్రీమతి సరస్వతి, జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి పెద్దపల్లి.