Listen to this article

లా ఎన్ ఫోర్స్ మెంట్ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఈఓ

జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి: పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటర్ జాబితా సవరణ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు . సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి. వేణు, జే. అరుణ శ్రీ లతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కంటే నిర్వహించిన ఎన్నికల కంటే మెరుగ్గా రాబోయే రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు, అన్ని వర్గాలకు చెందిన ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు వినూత్న కార్యక్రమాలు అమలుకు, పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని ఆయన తెలిపారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాల పట్ల ప్రతి ఒక్క సిబ్బంది అవగాహన కల్గి ఉండాలని, ప్రతి ఒక్కరికి తమ పాత్ర పట్ల , విధులు గురించి పూర్తిగా తెలిసి ఉండాలని అన్నారు. సజావుగా శాంతి భద్రతల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు చేపట్టాల్సిన చర్యల గురించి సలహాలు అందించాలని అన్నారు.ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు గంగయ్య, సురేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.