

జనం న్యూస్ మార్చి 28:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలకేంద్రంలోఉన్నఅన్ని గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తాడ్పాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలఉపాధ్యాయులుఅన్నారు.శుక్రవారం రోజునాఉపాధ్యాయులు బట్టాపూర్ గ్రామంలో విద్యార్థులతల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వపాఠశాలలోకొనసాగుతున్న విద్యగురించివారికీ అవగహన కల్పించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ..వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగాబట్టాపూర్ గ్రామంలో పాఠశాలను,బట్టాపూర్ తండాలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.కార్యక్రమం లో జడ్పి ఉన్నత తడపాకల్ పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాద్యాయులు నవీన్, భూపతి, కృష్ణ ప్రసాద్, విద్యార్థుల తల్లి దండ్రులు మాలవత్ రవి నాయక్, భూక్య సంతోష్ నాయక్ తదితరులు, పాల్గొన్నారు.