

జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రాజమండ్రి లో అకాల మరణమునకు గురైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణము క్రైస్తవ సమాజంనకు తీరని లోటు, ఆయన అనేక పేదలను, అనాధులను పోసించే గొప్ప వ్యక్తి అని విజయనగరం జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షులు రెవ.బి.ఎం. రాజు తెలియ చేశారు. స్థానిక కంటోన్మెంట్ లో జిల్లా కలక్టరేట్ ఎదుట జరిగి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం విషయమై పలు జిల్లా క్రైస్తవ సంఘాలు సంయుక్తముగా నిర్వహించిన కార్యక్రమం లో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబం నకు సంతాపం తెలియ చేసి వారి మరణం విషయమై నిరసన తెలియచేసారు. విజయనగరం జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు రెవ.ఎస్. మధు మాట్లాడుతూ క్రైస్తవ సమాజములో ఎంతో పేరొందిన నాయకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయని తీవ్రముగా కండించారు. ప్రవీణ్ గారి మరణం విషయం లో ప్రభుత్వం జోక్యం చేసుకొని క్రైస్తవ సమాజంను కాపడాలని ఫెడరేషన్ వింగ్ ప్రెసిడెంట్ శ్రీ పట్నానా పైడిరాజు కోరారు. కార్యక్రమంలో పాల్గొనిన ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు డా.పి. ప్రేమానందం మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ గారి మరణం ప్రమాదం కాదని అది కేవలం హత్య అని క్రైస్తవులందరికి పలు అనుమానలు వున్నాయి.ప్రవీణ్ గారి మరణమునకు సంబంధించి పాస్టర్ గారిని హత్య చేశారామో అని క్రైస్తవులకు ఉన్న అనుమానమును నివృత్తి చేసి ఒక వేల హత్య అయితే విచారణ జరిపించి హంతకులను గుర్తించి వారిని వెంటనే శిక్షించి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని క్రైస్తవ సమాజానికి రక్షణ కల్పించాలని, రాష్ట్రం లో మత స్వేచ్చను కాపాడాలని కోరారు. రెవ. ఎం. ఐజాక్ మాట్లాడుతు ప్రవీణ్ మరణమునకు పలు అనుమానలు వున్నాయని ఖండిస్తూ, ప్రవీణ్ గారి కుటుంబంనకు సంతాపమును తెలియ చేశారు. జిల్లా దళిత నాయకులు రమణ మాట్లాడుతూ ప్రభుత్వం పక్షపాతం వహించకుండా సరియైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవ.ఎం. పాల్సన్,రెవ.కె.వివేక్, ఎల్.పి.ప్రెసిడెంట్ వి. సత్యరాజు, సెక్రటరీ, రెవ.ఎల్.మధుశుదన్, పి.పి.ఎఫ్ ప్రెసిడెంట్ రెవ. డి.ఎలీషా, టి.పి.ఎఫ్.ప్రెసిడెంట్ రెవ మధు మనోహర్,రెవ.పి. యబ్బోజు రెవ.ఎస్.నికోడేమస్, రెవ ఎ.సునీల్, రెవ. జయప్రకాశ్,పాస్టర్ T. ప్రదీప్, టి.కరుణకుమార్ రెవ. ఎస్. యేహెజ్కియేల్ శామ్యూల్ బాడంగి, ఎల్ భాస్కర్, డి.ఎస్. రాజు, శేఖర్, కొత్తవలస,రెవ.పెంట ఐజాక్ మరియు జిల్లా నలుమూలల నుండి తదితర నాయకులు అన్ని మండలాల నాయకులు ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.