

జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే రాజ్యాంగాన్ని అపహస్యం చేసేలా బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో జరిగిన జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ మండల స్థాయి సన్నాహక సమావేశం ఆయన పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ ను అవమానపరిస్తే వారిని స్మరించుకుంటూ రాజ్యాంగాన్ని రక్షించుకునేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం తప్ప దేశానికి బీజేపీ పార్టీ ఏం చేయలేదని,కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాలను సమన్యాయం చేసిందని అన్నారు.పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించిన బీజేపీ నాయకుడు అమిత్ షా పదవి రాజీనామా చేయాలని,ఆయన్ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ఏఐసీసీ పిలుపు మేరకు ఏప్రిల్ రెండవ తారీఖు నుండి రాష్ట్రీయ రాజ్యాంగ పాదయాత్ర పేరుతో గ్రామాల్లో పాదయాత్ర చేపట్టామని ఇట్టి కార్యక్రమమును వాడ,వాడకు తీసుకెళ్ళి బీజేపీ రాజ్యాంగాన్ని ఏ విధంగాఅవమానపరిస్తుందో,రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందో ప్రజలకు తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట టౌన్ అధ్యక్షుడు సుంకరి రమేష్,మండల అధ్యక్షుడు పర్శరామరావు,మండల మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక,శివ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న-సదానందం,వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి,డైరక్టర్లు, ధర్మారం సింగిల్ విండో చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి,మాజీ కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి మల్లయ్య,దేశిని కోఠి,సాయిని రవి,రాకేశ్,అనిల్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ములుగూరి సదయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణి,జమ్మికుంట పిడుగు భాగ్య,తోట స్వప్న,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు,కార్యదర్శి సజ్జు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, యూత్ నాయకులు,ఎన్ఎస్యూఐ నాయకులు,ఎస్సీ సెల్,బీసీ సెల్,మైనారిటీ సెల్,కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
