

జనంన్యూస్ మార్చి 29 బట్టా శ్రీనివాసరావు
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోనీ పేరూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం లో వాజేడు మండల ప్రధాన కార్యదర్శి టిడిపి సీనియర్ నాయకులు గుడివాడ సత్యనారాయణ మరియు దాని శెట్టి ఆంజనేయులు. ఎట్టి చందర్రావు. గుడివాడ గణేష్. తుమ్మ వెంకటేశ్వర్లు. సారిక లక్ష్మణ్. బట్టి నరసయ్య. తుమ్మ సాయి తదితరులు పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మా నమ్మకం ఉందని ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించినట్టుగానే తెలంగాణలో కూడా విజయం సాధించి తెలుగు ప్రజల ఆశయాల సాధన కోసం అన్నగారు కలలు కన్న విధంగా తెలుగు వారి శ్రేయస్ కోసం కృషి చేస్తామని చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నామస్మరణలతో తెలంగాణలో విజయం సాధిస్తామని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది