

జనం న్యూస్ మార్చి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి
కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పర్యటించను న్నారు. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం 45వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్య మంత్రి హాజరుకానున్నారు.
అదే విధంగా రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొన నున్నారు. ఈక్రమంలోనే నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయను న్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తా రని సమాచారం. కోడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి, పర్యటన అనేక ప్రజాసేవ కార్యక్ర మాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది.