Listen to this article

జనం న్యూస్. మార్చి 29. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని విష్ణువైపర్ ఫార్మసీ కళాశాలలో ఔషద్ 2025 అంతర్జాతీయ సదస్సు రెండవ రోజు శనివారం నాడు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా. డాక్టర్ కృష్ణమోహన్ చిన్మాల డ్రీం కాలేజ్ ఆఫ్ ఫార్మసి ఎన్ ఎన్ ఆర్ జి తెలంగాణ.ఫార్మా హెచ్ఓడి డిపార్ట్మెంట్ బయోలాజికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ డాక్టర్ చంద్రయ్య గొడుగు. పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమోహన్ చిన్మాల మాట్లాడుతూ. ఫార్మసీ రంగం యొక్క ప్రాముఖ్యత వివరాలను విద్యార్థులకు వివరించారు. విష్ణు వైపర్ ఫార్మసీ కళాశాలలో అనుభ వజ్జులైన ఉపాధ్యాయులు ఉన్నారని అనేక రకాల ఆధునిక వసతులతో కూడిన ప్రయోగశాలలు ఉన్నాయని వాటన్నిటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఓరల్ పోస్టర్ ప్రెసెంటేషన్లో గెలుపొందిన విద్యార్థులకు విష్ణు కప్ క్రీడల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో. వైపర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రమేష్. ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేష్. కళాశాల హెచ్ ఓ డి లు వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.