Listen to this article

అచ్యుతాపురంలో


31న టీడీపీ శ్రేణులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యేక సమావేశం

జనం న్యూస్,మార్చి29, అచ్యుతాపురం

యలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు,ఏపీ ఆర్డీసి చైర్మన్,టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ప్రగడ నాగేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆలోచనలకు, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ అని,టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని మరింతగా దోహదం చేస్తున్నారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించారని, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. నాడు టీడీపీ చేసిన అభివృద్దె ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి కారణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసి కార్యకర్తలందరి సహకారంతో పార్టీని ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 31న అచ్యుతాపురంలో గల లేపాక్షి కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశం అవుతారని,టీడీపీ నాయకులు అందరూ ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రీ సాయి కృష్ణ, గవర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు విజయబాబు,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సూర్య నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు ఇత్తంశెట్టి రాజు,గొర్లి నానాజీ,రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహ కార్యదర్శి దాడి ముసలి నాయుడు, రాష్ట్ర అంగన్వాడి సెల్ ఉపాధ్యక్షురాలు నారాయణమ్మ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సాంబ తదితర నాయకులు పాల్గొన్నారు.